– శ్రద్దావాకర్ హత్య తరహాలో ముంబయిలో మరో హత్య
ముంబయి : శ్రద్దావాకర్ హత్య తరహాలోనే ముంబయిలో మరో ఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. ముంబయిలోని మీరా రోడ్డులోని ఓ ఇంటిలో మనోజ్ సహానీ(56), సరస్వతి వైద్యతో మూడేండ్లుగా కలిసి ఉంటున్నాడు. అయితే నిన్న వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో మృతురాలి శరీర భాగాల ముక్కలను పోలీసులు గుర్తించారు. ఈ హత్యను దాచిపెట్టేందుకు అతడు యత్నించాడని.. ఆమె శరీర భాగాల్లో కొన్నింటిని నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మనోజ్ సహానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.