తెలంగాణ సాహితీ వైభవం

– నేటి ‘దశాబ్ది’లో సాహిత్య దినోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. గడచిన 9 ఏండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా ఈ వేడుకలను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఉర్దూ, తెలుగు భాషల్లో రచన, పద్యం, కవి సమ్మేళనాలను రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు.