విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట..

– ఆకారంలో ఘనంగా విద్యా దినోత్సవం
– 24 లక్షల వ్యయంతో నిర్మించిన మన ఊరు మనబడి పనులను ప్రారంభించిన మెదక్ ఎంపీ
– పాఠశాల ఆవరణ మొక్క నాటిన ఎంపీ
–  కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
సమైక్య పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 14 ఏళ్ల కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్ధిలో పరుగులు వేస్తోంది. స్వరాష్ట్రంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను తెలంగాణ సర్కార్ అందిస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దుబ్బాక మండల పరిధిలోని ఆకారం గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గ్రామ సర్పంచ్ నాగభూషణం, ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ” విద్యా దినోత్సవం”ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ హాజరై  “మన ఊరు మన బడి” లో భాగంగా 24 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు, రీడింగ్ రూమ్,సైన్స్ ల్యాబ్, వంట గది, డైనింగ్ హాల్ నీ గ్రామ సర్పంచ్ కాస  నాగభూషణం, ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాయణ గౌడ్, ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ తో పాటు పలువురు సర్పంచులు, ఎంఈఓ జోగు ప్రభాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్, ఎస్ఎంసీ చైర్మన్ రాజు లతో కలిసి “మన ఊరు మనబడి” పనులను మెదక్ ఎంపీ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను ప్రజాప్రతినిధులు ,అధికారులతో నాటారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ మాట్లాడుతూ… లక్షలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తోందన్నారు.విద్యావ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ…ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల రూపురేఖలు మారి…. విద్యార్థులకు అధునాతన హంగులతో పాఠశాలలను నిర్మించి, అన్ని రకాల వసతులను కల్పిస్తోందన్నారు. ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి గ్రామాల నుండి ఈ పాఠశాలలకే విద్యార్థులు వచ్చి చదువుకునేలా ఇక్కడి హై స్కూల్ ను తీర్చిదిద్దామన్నారు. సిద్దిపేట, దుబ్బాక,రామాయంపేట, కామారెడ్డి ప్రైవేట్ పాఠశాలల్లోకి విద్యార్థులు వెళ్లకుండా…200 ఉన్న విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలన్నారు. ప్రభుత్వ బడుల్లోకివచ్చి పిల్లలు చదివేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత చొరవ, బాధ్యత తీసుకోవాలని సూచించారు. నేడు పల్లెటూరు నుండి పట్నం వెళ్లి చదువుకునే  పరిస్థితి నేడు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న పనితీరు ఇతర దేశాలకు ఆదర్శనీయంగా ఉందని, తెలంగాణ పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా ఈ పథకాలనే కాఫీ కొడుతున్నాయన్నారు. కనుమరుగు అవుతున్న పాఠశాలలకు ప్రభుత్వం కరెంట్, తాగునీరు, టాయిలెట్స్, డైనింగ్ హాల్స్, క్రీడా ప్రాంగణాలు, ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, రుచి శుచికరమైన భోజనం, విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ నీ ప్రభుత్వం అందిస్తూ పైసా ఖర్చు లేకుండా చదివిస్తుందని, ఈచక్కటి అవకాశాన్ని పేద,మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచింరు.  తదనంతరం ఇటీవల 10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ వెంట గోసాసన్ పల్లి సర్పంచ్ దొందడి లక్ష్మీ, బొప్పాపూర్ సర్పంచ్ బండమీది బాలమణి, పంచాయతీ రాజ్ పిఆర్డిఈ విజయ ప్రకాష్, ఏఈ రిజ్వన్, ఎంపిడివో భాస్కర శర్మ,  బీఆర్ఎస్ నాయకులు ఎంపీ పరామర్శ. ఇటీవల దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సుద్దాల పర్షయ్య మృతి చెందారు.ఈ విషయం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  తెలుసుకొని మంగళవారం బాధిత కుటుంబానికి కలిసి పరామర్శించారు.