బాసర త్రిపుల్‌ఐటీ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి

– అది ఆత్మహత్యా, ప్రమాదమా అన్నది నిగ్గుతేల్చాలి
– ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బాసర త్రిపుల్‌ఐటీలో వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. అమ్మాయి చని పోయిన ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అన్నది నిగ్గు తేల్చాలని కోరింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించాలని తెలిపింది. అక్కడ నిరసన తెలిపేందు కు వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రం గా ఖండించింది. వారిని వెటనే విడు దల చేయాలని డిమాండ్‌ చేసింది.
ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగ రాజు గురువారం ఒక ప్రకటన విడు దల చేశారు. నిర్మల్‌ జిల్లా బాసర త్రిపుల్‌ఐటీలో వరుసగా ఇద్దరు విద్యా ర్థినీలు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు బాసటగా నిలవాలని డిమాండ్‌ చేశా రు. సమస్యలు పరిష్కారం చేయ కుండా తాత్సారం చేయడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు.
విద్యార్థిని మరణం ప్రమాదవ శాత్తు జరిగిందా లేక ఆత్మ హత్య అనే అంశంపై విచారణ జరిపిం చాలని కోరారు. వసతులు సరిగ్గా లేకనే ఈ ఘటన జరిగిందని తెలి పారు. సరైన సౌకర్యాలు కల్పించని మూలంగా విద్యార్థుల ప్రాణాలను అధికారులు గాలికి వదిలేసి వ్యవరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేట ని విమర్శించారు. పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. కావున తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన దీపికా కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరారు.
సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి : ఏఐఎస్‌ఎఫ్‌
బాసర త్రిపుల్‌ఐటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థినీల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అక్కడికి వెళ్లకుండా ముఖ్యమంత్రి, విద్యామంత్రి ఏం చేస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆ ప్రాంగణంలోకి విద్యార్థి సంఘాలను, మేధావులను వెళ్లనీయకుండా అరెస్టు చేయడం, నిర్బంధాలు ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని తెలిపారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్యస్థైర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకోవాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.