గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు బిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు..

నవతెలంగాణ -మద్నూర్ 
నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం 12వ రోజు సమ్మె కొనసాగుతుంది గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజు మార్కెట్ సంతలో ప్రతి కిరణ కొట్టు బట్టల దుకాణం టీ పాయింట్స్ కూరగాయల దుకాణం గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులకు అందరినీ కలిసి కార్మికులు బిక్షాటన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ కార్మికులకు మద్దతు తెలుపుతూ భిక్షాటన కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక నాయకులతో చర్చలు జరిపి వీరు యొక్క న్యాయమైన 14 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్షాలు కురుస్తున్నాయి కావున గ్రామంలో మండల కేంద్రంలో మురికి చెత్త చెదర పేరుకుపోయి అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది కావున కార్మికులతో చర్చలు జరిపి వీరికి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని లేనిచో ప్రజల ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉన్నది కావున వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 19500 రూపాయలు ఇవ్వాలని కారోబర్ మరియు బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా తీసుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి 20 జీవో నెంబర్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు బిక్షాటన కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం మండల నాయకులు ఎం. తులసి రామ్, జె మారుతి, సరూప, బి గంగాధర్, రజాక్, హైమద్, గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.