హృదయం పదిలం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కానీ చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రోసెస్డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటూ ఉంటారు. వ్యాయామం చేయడాన్ని కూడా అంత సీరియస్‌గా తీసుకోరు. దీని కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడు తుంది. అందుకే శరీరం, గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి. అవి… జీవనశైలి మారడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మన దరికి రావు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చు. మానసికంగా ఆరోగ్యం గా ఉండగలుగుతాం. జీవితకాలం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండగలుగుతాం. మలి వయసులో సైతం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.