ఆ సంఘటన కలిచివేసింది

– ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ ఘటనపై నివేదిక కోరిన గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లంబాడ గిరిజన మహిళలపై జరిగిన దాడి తనను మనోవేదనకు గురిచేసిందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆ ఘటన గురించి మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న గవర్నర్‌ తనకు 48 గంటల్లోనే నివేదిక కావాలని సీఎస్‌, డీజీపీ, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌లను కోరింది. దీంతోపాటు బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని వెంటనే అందించాలని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రంగారెడ్డిజిల్లా శాఖను ఆదేశించారు.