దివ్యాంగుల పింఛన్ పెంచడం గర్వించదగ్గ విషయం

– పెద్ద బోయిన శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ములుగు జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మన ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులైన వికలాంగుల పింఛన్ పెంచడం సర్వత్ర హర్షించదగ్గ విషయం అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ములుగు జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన సియం కెసిఆర్ కి ములుగు జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమ యంలో ఎం జరగాలని కోరుకున్నామో వాటిని సాధిం చుకుంటూ తెలంగాణ రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కెసిఆర్ కే సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సాధక బాధకాలు తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా దివ్యాంగుల పెంచాను 3016 రూపాయలు చేసి మల్లి నేడు 4116 పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కి మరో మారు వికలాంగులందరూ రుణపడి ఉంటారని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాము అన్నారు.