– పేదలకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
ప్రభుత్వ పథకాలు అమలులో అధికార పార్టీ నేతల జోక్యం తగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అధికార పార్టీ నేతల జోక్యం ఏమిటని, దీని ద్వారా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోగా అనర్హులకు లబ్ది చేకూరుతుందని, కమీషన్‌లకు కక్కుర్తి పడి పథకాలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. గృహలక్ష్మి పథకం అర్హులైన వారందరికీ వర్తింపజేసి, రూ.5లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు తదితర పథకాలు లబ్ధిదారులు ఎంపిక గ్రామ సభల ద్వారా చేయాన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలని ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు గౌరీ నాగేశ్వరరావు, వూకంటి రవికుమార్, పొడియం వెంకటేశ్వర్లు, రావుజా, దేవేందర్, సామిని, లక్మినర్సయ్య, తిమ్మంపేట సర్పంచ్ గౌరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.