సమ్మెకు దిగిన వంట కార్మికులు…

– వంట చేసిన ఉపాద్యాయులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
మధ్యాహ్నం భోజనం కార్మికులు కు పెండింగ్ బిల్లులు, వేతనాలు,గ్రుడ్లు బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పధకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక రోజు సమ్మెకు దిగారు. మండలం లో కార్మికులు సోమవారం విద్యాశాఖ మండల వనరుల కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లులు విడుదల చేసేంతవరకు వంట చేయమని ఆ శాఖ మండల అధికారి కృష్ణయ్య కు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ విద్యార్థులు కు ఇస్తున్న మెనూ కు బయట మార్కెట్లో ధరలు తో పోల్చితే ఏ మాత్రం సరిపోవడం లేదని,ఎదురు పెట్టుబడి పెట్టిన కార్మికులు కు నెలల తరబడి వంట బిల్లులు వేతనాలు, గ్రుడ్లు బిల్లులు అందక వంట కార్మికులు అప్పులు పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్లుగా విద్యార్థులు మెనూ చార్జీలు పెంచాలని,కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వంట కార్మికులు యామిని,వెంకమ్మ, నాగ దుర్గ,చిలకమ్మ, ఈశ్వరమ్మ,గోపమ్మ,కనకమ్మ, మురళీ తదితరులు పాల్గొన్నారు.
వంటలో నిమగ్నం అయిన ఉపాద్యాయులు…
పెండింగ్ బిల్లులు కై వంట కార్మికులు సోమవారం సమ్మెకు దిగడంతో చేసేదేమీ లేక కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే వంట కార్మికులు పాత్ర పోషించారు.బోధన పక్కన పెట్టి   వంట చేసి విద్యార్ధులకు వడ్డించారు.