బాజిరెడ్డి గోవర్ధన్ ని కలిసి అభినందనలు తెలిపిన బీసీ సంఘం నాయకులు

నవతెలంగాణ -కంటేశ్వర్

ఇటీవలే కేసీఆర్  ప్రకటించిన బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బాజిరెడ్డి గోవర్ధన్ కి మూడవ సారి అవకాశం రావడం బీసీలకు గర్వకారణం అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా బిసి సంక్షేమ సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాజిరెడ్డి గోవర్ధన్  సేవలో ముందుంటారు కాబట్టి ముందు ముందు వారికి పెద్ద పదవులు రావాలని ప్రార్థిస్తున్నామని అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్ నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ధర్శనం దేవేందర్, బాలన్న, విజయ్, విష్ణు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.