నవతెలంగాణ – నసుతుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పథకంలో ప్రవేశపెట్టిందని కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బీర్కూర్ ఎంపీపీ రఘు తెలిపారు సోమవారం మండలంలోని బీర్కూర్ తాండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రఘు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు ఇస్తారని చెప్పారు. గ్రామస్తులు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి కంటి పరీక్ష చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవిబాయ్, ఉపసర్పంచ్ రుక్మిణి, కంటి వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు