మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

నవతెలంగాణ- శంకర్‌పల్లి
ఇంట్లో కిరాయికి ఉన్న మహిళను నమ్మించి, బలవంతంగా శారీరకంగా కలిసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శంకరపల్లి పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ ప్రసన్న కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోలోని శ్రీరాం నగర్‌ కాలనీకి చెందిన నారెగూడెం కార్తీక్‌ రెడ్డి ఇంట్లో మోకిల గ్రామానికి చెందిన మహిళ కిరాయి ఉంటోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవంతంగా ఇంట్లోకి గుంజుకొని వెళ్ళి ఆమెతో శారీరకంగా కలిశాడు. అలా రెండు, మూడు సార్లు బలవంతంగా శారీరకంగా కలవడంతో ఆ మహిళ గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చింది. దీనికి కారణం అయిన కార్తీక్‌ రెడ్డిని పెళ్లి చేసుకొమ్మని అడగ‌గా తనకు ఎలాంటి సంబంధం లేదని మాట దాటవేశాడు. దీంతో బాధితురాలు శంకర్పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నింది తుడు కార్తీక్‌ రెడ్డిపై కేసు నమోదు, అతన్ని అరెస్టు చేశారు. చేవెళ్ళ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించినట్టు సీఐ తెలిపారు.