శానిటేషన్ జోన్ 2కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని శానిటేషన్ జోన్ 2కార్యాలయానికి ఆకస్మికంగా సందర్శించి కార్మికుల హాజరు పట్టికను తనిఖీ మంగళవారం నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ చేశారు.కార్మికులు సమయపాలన పాటించాలని నగర శుభ్రతలో రాజీ పడకూడదని సూచించారు.జోన్ పరిధిలోని విదులలో పర్యటించి పరిష్యుద్ద పనులను పరిశీలించారు.ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా క్రమం తప్పకుండా చెత్త వాహనాల ద్వారా ఇంటింటి నుండి చెత్తను సేకరించాలని ప్రజలు కూడా చెత్త వాహనం వచ్చే వరకు చెత్తను ఇంటి వద్దే ఉంచుకుని వాహనాలకు చెత్త ను అందించాలని రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపాలిటీ వారికి సహకరించి చెత్త రహిత నగరానికి తమవంతు బాధ్యత నిర్వహించాలని అన్నారు.వీక్లీ మార్జెట్ లోని మటన్ షాపులను సందర్శించి జంతువులను జంతు వదశాలలో మాత్రమే కోయాలని, ప్రజారోగ్యం విషయంలో అధికారులు అలసత్వం వహించకుండా విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ సాజిద్ అలీ, శానిటేరి ఇన్స్పెక్టర్లు నటరాజ్ గౌడ్, ప్రశాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.