అందరూ మాట్లాడుకునే సినిమా

అందరూ మాట్లాడుకునే సినిమాసత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కష్ణమ్మ’. వి.వి.గోపాలకష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమాను ఈనెల 10న విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరైన డైరెక్టర్స్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కొరటాల శివ, అనీల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని ‘కష్ణమ్మ’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.
దర్శకుడు వి.వి.గోపాలకష్ణ మాట్లాడుతూ, ‘కథలో ఓ నిజాయతీ ఉంది. ఈనెల 10 తర్వాత సినిమా చూస్తే టైటిల్‌ ఏంటో అర్థమవుతుంది’ అని అన్నారు. ”కష్ణమ్మ’ సినిమా గురించి అందరం మాట్లాడుకునేలా ఉంటుంది’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. చిత్ర సమర్పకుడు కొరటాల శివ మాట్లాడుతూ, ‘రాజమౌళికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ‘కష్ణమ్మ’ సినిమా కథ వినమని నిర్మాత కష్ణ చెప్పగానే డైరెక్టర్‌ గోపాలకష్ణ వచ్చి కథ చెప్పాడు. వినగానే ఈ సినిమాలో నేను భాగం అవుతానని చెప్పాను. అలా నేను ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాను. డైరెక్టర్‌ గోపాలకష్ణ కథని చక్కగా రాసుకున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసి, తనే సినిమా చూపించాడు’ అని తెలిపారు.
డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ, ‘ఈ మూవీతో సమర్పకుడిగా మారుతున్న కొరటాల శివగారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన ఈ సినిమాను ప్రెజెంట్‌ చేస్తున్నారంటే అందరికీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఉంటుంది. శివకి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ గోపాలకష్ణ టీజర్‌, ట్రైలర్లలో తక్కువ షాట్స్‌లోనే చాలా ఎట్రాక్టివ్‌గా, సినిమాను థియేటర్స్‌ చూడాలనిపించేలా చేశాడు. సత్యదేవ్‌ నటనలో ఏ ఎమోషన్‌ను అయినా పలకించగలడు’ అని అన్నారు.