గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ఎంపీపీ నక్షత్రం జయవంత్‌
విద్యుత్‌ సమస్యలు పరిష్కరించకపోతే
పంచాయతీ ద్వారా బిల్లులు చెల్లించం:సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆరోపణ
నవతెలంగాణ-మొయినాబాద్‌
గ్రామాలను విడతల వారిగా అభివృద్ధి చేసి, నెలకొన్న సమస్యల పరిష్కరించేందుకు కృషి చేద్దా మని మండల ఎంపీపీ నక్షత్రం జయవంత్‌ అన్నారు. బుధవారం మొయినాబాద్‌ మండల పరిషత్‌ కార్యా లయంలో మండల సర్వసభ్య సమావేశం మొయి నాబాద్‌ ఎంపీపీ నక్షత్రం అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి సంధ్య నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ నక్షత్రం ఎజెండా అంశా లను చదివి వినిపించారు. కరెంటు సమస్యలపై అధికారి మాట్లాడుతుండగా, గ్రామాల సర్పంచులు విద్యుత్‌ సమస్యలపై అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని తెలి పారు. విద్యుత్‌ అధికారులు గత నాలుగేండ్లుగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం నిర్వహించలేదన్నారు. ఎత్‌బార్‌పల్లి గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఒక వ్యక్తి షాప్‌ తగిలి మృతి చెందడాని అన్నారు. ప్రమాదాలు జరుగుతున్నా ఆ ట్రాన్స్‌ఫార్మర్ల సమ స్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్‌ సమస్యలు నేటికీ పట్టించుకోవడంలేదని ఆ గ్రామ సర్పంచ్‌ నవనీత తెలిపారు. ఏనికేపల్లి గ్రామంలో ఇనుప స్తంభాలు తొలగించాలని పలుమార్లు విన్నవిం చుకున్నా, పట్టించుకోరా అని ఆ గ్రామ సర్పంచ్‌ చందన నిలదీశారు. రెంటు సమస్యలు పరిష్కరిస్తేనే గ్రామ పంచాయతీ బిల్లులు చెల్లిస్తామని సర్పంచ్‌ చందన ,మహేందర్‌ రెడ్డి, శోభ వెంకట్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి ,శ్రీనివాస్‌ ముదిరాజులు సభ ముందు విన్న వించారు. గ్రామాల్లో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో కొన సాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని అవి కూడా సర్పంచ్‌లే నిర్వహిస్తున్నామనీ, మరి ఆ సంస్థ ఏం పని చేస్తుందో చెప్పాలని సర్పంచులు ప్రశ్నించారు. గ్రామాల రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారినా, కనీసం మరమ్మతులు కూడా చేపట్టరా అని నిల దీశారు. అనంతరం మండల పరిషత్‌ అధ్యక్షురాలు నక్షత్రం మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు దశలవారీగా పరిష్క రించుకుందామని తెలి పారు. సర్వసభ్య సమావేశంలో తెలుసుకున్న సమ స్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అభి వృ ద్ధికి సహకరించి గ్రామాలు అభివృద్ధి చేసు కోవా లని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మం డల అభివృద్ధి అధికారి సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర రెడ్డి, వైస్‌ ఎంపీపీ మమత, ఎంఈవో వెంకటయ్య, సర్పంచులు, ప్రభాకర్‌ రెడ్డి ,చందన, నవనీత, శ్రీనివాస్‌, శోభ ,ప్రవీణ్‌ కుమార్‌, మహేం దర్‌ రెడ్డి, ఎంపీటీసీలు మండల అధికారులు ఉన్నారు.