సమాచార హక్కు చట్టాన్ని అమోదించిన రాష్ట్రపతి

The President passed the Right to Information Act1. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కును ప్రవేశపెట్టిన దేశం ఏది?
1. ఫ్రాన్స్‌ 2. కెనడా 3. స్వీడన్‌ 4. ఐర్లాండ్‌
2. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది?
1. 15.06.2005 2. 15.06.2004
3. 15.08.2005 4. 12.10.2005
3. మన దేశంలో సమాచార హక్కు చట్టం రూపొం దించిన తొలి రాష్ట్రం తమిళనాడు కాగా రెండవ రాష్ట్రం ఏది?
1. గోవా 2. కేరళ
3. గుజరాత్‌ 4. ఉత్తరప్రదేశ్‌
4. కేంద్ర సమాచార కమీషన్‌లో ప్రధాన కమీషనర్‌ ను, ఇతర కమీషనర్‌లను నియమించువారు ఎవరు?
1. ప్రధానమంత్రి 2. ఎలక్షన్‌ కమీషన్‌
3. పార్లమెంట్‌ 4. రాష్ట్రపతి
5. కేంద్రసమాచార కమీషన్‌లోని ప్రధాన కమీషన్‌, ఇతర కమీషనర్‌ల గురించి క్రింది వాటలో సరైనవి ఏవి?
ఎ. వీరి జీతభత్యాలను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.
బి. వీరి రాజీనామాలను రాష్ట్రపతికి సమర్పిస్తారు
సి. వీరి పదవీకాలం కేంద్రప్రభుత్వం నిర్ణయిస్తుంది
1. ఎ మాత్రమే 2. బి, సి
3. ఎ, బి, సి 4. ఎ, బి
6. క్రింది వాటిలో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాని అంశాలు ఏవి?
1. విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు
2. దేశ రక్షణకు సంబంధించిన అంశాలు
3. కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు
4. పైవన్నీ
7. సమాచారం కోరే వ్యక్తి / దరఖాస్తుదారునికి కమీ షన్‌ ఎన్ని రోజుల లోపు సమాచారం ఇవ్వాలి.
1. 40 రోజులు 2. 30 రోజులు
3. 10 రోజులు 4. 14 రోజులు
8. 1966 లో సమాచార హక్కును ఏ దేశం ప్రవేశపెట్టింది?
1. కెనడా 2. భారత్‌ 3. అమెరికా 4. రష్యా
9. మనదేశంలో సమాచార స్వేచ్ఛా చట్టాన్ని ఏ ప్రధాన మంత్రి కాలంలో రూపొందించారు?
1. పి.వి. నరసింహారావు 2. అటల్‌ బిహారి వాజ్‌పేరు
3. మన్మోహన్‌ సింగ్‌ 4. దేవేగౌడ
10. సమాచార హక్కు చట్టంపై ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ఎవరు?
1. కె.ఆర్‌. నారాయణ్‌ 2. అబ్దుల్‌ కలాం
3. ప్రతిభాపాటిల్‌ 4. ప్రణబ్‌ ముఖర్జీ
11. కేంద్ర సమాచార కమీషన్‌ లోని కమీషనర్‌ Ê ప్రధాన కమీషనర్‌లను స్క్రీనింగ్‌ కమిటి సూచ నల మేరకు నియమిస్తారు. కాగా ఈ కమిటీ లోని సభ్యులను క్రింది వారిలో గుర్తించండి.
ఎ.ప్రధానమంత్రి బి. క్యాబినెట్‌ మంత్రి
సి. స్పీకర్‌ డి. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు
1. ఎ, సి మాత్రమే 3. ఎ, బి, సి
3. ఎ, బి, డి 4. ఎ, బి, సి, డి
12. సమాచారం కోరే వ్యక్తి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది అయితే ఆ దరఖాస్తు దారునికి ఎంత సమయంలోపు సమాచారం ఇవ్వాలి.
1. 3రోజులు 2. 24 గంటలు
3. 48 గంటలు 4. 10 రోజులు
13. క్రింది ఏయే సందర్భాల్లో సమాచార అధికారికి శిక్ష విధించబడుతుంది.
1. సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసినపుడు
2. దరఖాస్తు తీసుకోవడానికి తిరస్కరించినపుడు
3. కోరిన సమాచారాన్ని పూర్తిగా తొలగించినపుడు
4. పైవన్నీ
14. సమాచారం కోరే వ్యక్తి దరఖాస్తును పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ తిరస్కరించినట్లయితే ఆ అధికారిపై ఎన్నిరోజుల లోపు పై అధికారికి ఫిర్యాదు ఇవ్వాలి.
1. 30 రోజులు 2. 60 రోజులు
3. 14 రోజులు 4. 90 రోజులు
15. మనదేశంలో బ్రిటీష్‌ పరిపాలనా కాలంలో అధికార రహస్యాల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1. 1909 2. 1923 3. 1919 4. 1947
16. క్రింది వాటిలో సరైన అంశం/ అంశాలు గుర్తించండి.
1. కేంద్రసమాచార కమీషన్‌ లో ఎంపి మరియు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నియమించరాదు
2. స్క్రీనింగ్‌ కమిటీలోని క్యాబినెట్‌ మంత్రిని ప్రధాని నిర్ణయిస్తారు.
3. 1, 2 4. ఏదీకాదు
17. కేంద్ర సమాచార కమీషన్‌లోని ప్రధాన Ê ఇతర కమీషనర్ల పదవీకాలం
1. 5 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
2. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
3. 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
4. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
18. ప్రభుత్వాలు తమ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా ప్రజలకు అందిం చాలని ప్రాథమిక హక్కులలో అది అంతర్గతంగా ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు నిచ్చింది
1. కామన్‌ కాజ్‌ Vర ఖఉ×
2. రాజ్‌నారాయన్‌ Vర ఇందిరాగాంధీ
3. శూ వియర్స్‌ Vర ఖఉ×
4. కృష్ణ కుమార్‌ Vర బీహార్‌
19. 2010 లో సిజెఐ కార్యాలయం కూడా ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుందని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది.
1. ఢిల్లీ హైకోర్టు 2. అలహాబాద్‌ హైకోర్టు
3. కోల్‌కతా హైకోర్టు 4. ముంబయి హైకోర్టు
20. రాష్ట్ర సమాచార కమీషన్‌ లోని ప్రధాన, ఇతర కమీషనర్‌లను తొలగించునది ఎవరు?
1. రాష్ట్రపతి 2. గవర్నర్‌
3. ప్రధానమంత్రి 4. సుప్రీంకోర్టు
21. ఆంధ్రప్రదేశ్‌ తొలి ప్రధాన సమాచార కమీషనర్‌ ఎవరు?
1. రాజాసదారారు 2.జీన్నత్‌ హుస్సేన్‌
3. మహబూబ్‌ బాషా 4. చరణ్‌దాస్‌ అర్హ
22. తెలంగాణ సమాచార కమీషన్‌ ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది?
1. 2017 2. 2015 3. 2005 4. 2004
23. మొదటి కేంద్ర ప్రధాన సమాచార కమీషనర్‌ ఎవరు?
1. వైకే సిన్హా 2. వజహత్‌ హబీబుల్లా
3. జన్నత్‌ హుస్సేన్‌ 4. చరణ్‌దాస్‌ అర్హ
24. రాష్ట్ర సమాచార కమీషన్‌లోని ప్రధాన , ఇతర కమీషనర్ల పదవీకాలాన్ని నిర్ణయించేది?
1. కేంద్రప్రభుత్వం 2. రాష్ట్రప్రభుత్వం
3.రాష్ట్రపతి 4. గవర్నర్‌
25. ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమీషనర్‌ ఎవరు?
1. దీపక్‌సాధు 2. సురేష్‌ చంద్ర
3. వైకె సిన్హా 4. రేఖాశర్మ
26. అంబుడ్స్‌మన్‌ అనే పేరుతో లోక్‌పాల్‌ను పోలిన నిఘా సంస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేశం ఏది?
1. ఫిన్‌లాండ్‌ 2. స్వీడన్‌
3. నార్వే 4. డెన్మార్క్‌
27.లోక్‌పాల్‌ ఛైర్మన్‌, సభ్యులను నియమించునది ఎవరు?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. పార్లమెంట్‌ 4. సుప్రీంకోర్టు
28. లోక్‌పాల్‌ తమ నివేదికను ఎవరికి సమర్పిస్తారు?
1. పార్లమెంట్‌ 2. రాష్ట్రపతి
3. ప్రధానమంత్రి 4. న్యాయశాఖమంత్రి
29. లోక్‌పాల్‌, లోకాయుక్త ఎప్పటి నుండి అమల్లోకి వచ్చినవి.
1. 17-12-2013 2. 16-01-2013
3. 16-01-2014 4. 17-12-2014
30. మొదటిసారి ఎన్నవ లోక్‌సభలో లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టారు?
1. నాలుగవ 2. ఐదవ 3. ఆరవ 4. ఏడవ
31. లోక్‌పాల్‌ చైర్మన్‌ లేదా సభ్యులుగా నియమించ బడే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏవి?
ఎ. 45 సంవత్సరాలు ఉండాలి
బి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి
1. ఎ మాత్రమే 2. ఎ, బి 3. బి మాత్రమే 4. ఏదీకాదు
32. లోక్‌పాల్‌ చైర్మన్‌, ఇతర సభ్యులను నియమించే ఎంపిక కమిటీలో ఎంతమంది సభ్యులుంటారు?
1. 8 2. 9 3.5 4.4
33. లోక్‌పాల్‌ చైర్మన్‌ ఎవరు? పదవీకాలమెంత?
1. 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
2. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
3. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
4. 6 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
34. లోక్‌పాల్‌ తన దర్యాప్తును ఎన్నిరోజుల్లో పూర్తి చేయాలి?
1. 10 రోజులు 2. 45 రోజులు
3. 90 రోజులు 4. 60 రోజులు
35. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. లోక్‌పాల్‌కు సివిల్‌ కోర్టు హౌదా ఉంటుంది
బి. లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి
1. బి మాత్రమే 2. ఎ మాత్రమే
3. ఎ, బి 4. ఏదీకాదు
36. లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లుపై ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి
1. అబ్దుల్‌ కలాం 2. ప్రణబ్‌ ముఖర్జీ
3. ప్రతిభాపాటిల్‌ 4. రామ్‌నాథ్‌ కోవింద్‌
37. క్రింది వాటిలో లోక్‌పాల్‌ పరిధిలోకి రాని అంశాలను గుర్తించండి.
ఎ. ప్రధానమంత్రి విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు
బి. జాతీయ భద్రత, ప్రజాభద్రతకు సంబంధించిన ప్రధాని తీసుకున్న నిర్ణయాలు సి. విచారణ సంస్థలు
1. ఎ, బి, సి 2. ఎ, బి 3. బి, సి 4. ఏదీకాదు
38. మొట్టమొదటి లోక్‌పాల్‌ చైర్మన్‌ ఎవరు?
1. ఆర్‌కె జైన్‌ 2. పినకి చంద్రఘోష్‌
3. అభిలాష కుమారి 4. ప్రదీప్‌ కుమార్‌ మహంతి
39. లోక్‌పాల్‌ అనేది ఏ భాషా పదం?
1. సంస్కృతం 2. లాటిన్‌
3. ఫ్రెంచ్‌ 4. గ్రీకు
40. కేంద్రస్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తకు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏదీ?
1. వర్మ కమిటి 2. సర్కారియా కమిటీ
3. రాజ్‌ మన్నార్‌ కమిటి 4. సంతానం కమిటి
41. లోక్‌పాల్‌ బిల్లును రెండవ సారి ఏ లోక్‌సభ కాలంలో ప్రవేశపెట్టారు?
1. 7వ లోక్‌సభ 2. 4వ లోక్‌సభ
3. 5వ లోక్‌సభ 4. 8వ లోక్‌సభ
42. క్రింది వాటిలో లోకాయుక్త పరిధిలోకి వచ్చే అంశాలు.
ఎ. సహకార సంఘం అధ్యక్షులు బి. ముఖ్యమంత్రి
సి. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్లు
డి. శాసన సభ్యులు
1. ఎ, బి, డి 2. బి, సి, డి
3. ఎ, సి, డి 4. ఎ, బి, సి, డి
43. రాష్ట్రస్థాయిలో అవినీతి నిర్మూలన కోసం లోకాయుక్తను ఏర్పాటు చేయాలని పరిపాలన సంఘం ఏ సంవత్సరంలో సిఫార్సు చేసింది?
1. 1971 2. 1962 3. 1985 4. 1966
44. లోకాయుక్త చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. మహారాష్ట్ర 2. గోవా
3. కేరళ 4. ఒరిస్సా
సమాధానాలు
1.3 2.4 3.1 4.4 5.2
6.4 7.2 8.3 9.2 10.2
11.3 12.3 13.4 14.1 15.2
16.3 17.4 18.2 19.1 20.2
21.4 22.1 23.2 24.1 25.3
26.2 27.2 28.2 29.3 30.1
31.2 32.3 33.1 34.4 35.2
36.2 37.2 38.2 39.1 40.4
41.3 42.3 43.4 44.4
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు