ఇంగ్లాండ్‌కు షాక్‌

Shock for England– అఫ్గాన్‌ చేతిలో అనూహ్య ఓటమి
– అఫ్గనిస్థాన్‌ 284/10, ఇంగ్లాండ్‌ 215/10
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌, టైటిల్‌ ఫేవరేట్లలో ఒకరైన ఇంగ్లాండ్‌ స్పిన్‌ వలలో చిక్కుకుంది. 285 పరుగుల ఛేదనలో అఫ్గాన్‌ స్పిన్నర్ల మాయలో పడి 215 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్‌ చాంపియన్స్‌ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన అఫ్గనిస్థాన్‌ 69 పరుగులతో ఘన విజయం సాధించింది. అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
షాక్‌..షాక్‌. ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఫిరోజ్‌ షా కోట్లలో అఫ్గాన్‌పై అలవోక నెగ్గుతామనే విశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన బట్లర్‌సేనకు అఫ్గనిస్థాన్‌ స్పిన్నర్లు పీడకల మిగిల్చారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు ముజీబ్‌ రెహమాన్‌ (3/51), రషీద్‌ ఖాన్‌ (3/37) మూడు వికెట్ల ప్రదర్శనతో మాయజాలం చేశారు. 285 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (66, 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవిడ్‌ మలాన్‌ (32, 39 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ విభాగంలో ఎవరూ రాణించలేదు. 68 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ మళ్లీ కోలుకోలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ (80, 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇక్రమ్‌ అలిఖిల్‌(58, 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిశారు. మూడు వికెట్లతో పాటు 16 బంతుల్లో 28 పరుగులు చేసిన ముజీబ్‌ రెహమాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఇంగ్లాండ్‌కు ఇది రెండో ఓటమి కాగా.. అఫ్గనిస్థాన్‌కు ఇది తొలి విజయం.
మాయలో చిక్కి.. : 285 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్‌ ముజీబ్‌ రెహమాన్‌ బౌలింగ్‌ దాడిని మొదలుపెట్టగా.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే పేసర్‌ ఫరూకీ బ్రేక్‌ సాధించాడు. జానీ బెయిర్‌స్టో (2)ను వెనక్కి పంపించాడు. జో రూట్‌ (11)ను ముజీబ్‌ అవుట్‌ చేయగా.. డెవిడ్‌ మలాన్‌ (32)ను మహ్మద్‌ నబి సాగనంపాడు. దీంతో 12.4 ఓవర్లలో 68 పరుగులకే ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హ్యారీ బ్రూక్‌ (66) ఓ వైపు నిలిచినా.. మరో ఎండ్‌లో సహకారం దక్కలేదు. జోశ్‌ బట్లర్‌ (9), లివింగ్‌స్టోన్‌ (10), శామ్‌ కరణ్‌ (10), క్రిస్‌ వోక్స్‌ (9)లు దారుణంగా విఫలమయ్యారు. ఆదిల్‌ రషీద్‌ (20), మార్క్‌వుడ్‌ (18), టాప్లీ (15 నాటౌట్‌) చివర్లో ఓటమి అంతరాన్ని కుదించారు. 40.3 ఓవర్లలోనే పది వికెట్లు పడగొట్టిన అఫ్గనిస్థాన్‌ 69 పరుగులతో ఘన విజయం సాధించింది.
ధనాధన్‌ : టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు అఫ్గాన్‌ ఓపెనర్లు గట్టి పంచ్‌ ఇచ్చారు. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (8), ఇబ్రహీం జద్రాన్‌ (30) తొలి వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడగా ఆడిన రెహ్మనుల్లా ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 33 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం వరుస వికెట్లతో ఇంగ్లాండ్‌ రేసులోకి వచ్చింది. రహమత్‌ షా (3), హస్మతుల్లా (14), ఓమర్‌జారు (19) నిరాశపరిచినా.. ఇక్రమ్‌ ఇలిఖిల్‌ (58), రషీద్‌ ఖాన్‌ (23), ముజీబ్‌ రెహమాన్‌ (28) మెరుపులతో అఫ్గనిస్థాన్‌ 284 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (3/50), మార్క్‌వుడ్‌ (2/50) రాణించారు.

Spread the love
Latest updates news (2024-05-20 10:17):

rimal source official supplements | maximizer big sale male enhancement | brintellix erectile Yan dysfunction men | libido enhancing foods and fruits x53 | PnW can cetirizine hydrochloride cause erectile dysfunction | ultimate forza cI3 male supplement | ayurvedic treatment for erectile dysfunction in bVH dubai | erectile bSA dysfunction anonymous group psychotherapy | online test v20 erectile dysfunction | gDh what male enhancement pill | max one supplement reviews mIW | viagra most effective pill cutter | what is lebido cbd oil | code red male ASI enhancement | sexual enhancement JBJ drugs for men | Ims making a penis pump | are they cbd cream safe | urcinol doctor recommended review | stiff cbd vape rox | essential oils for 5Ol couples | top rated HIn male enhancement pills 2018 | good online sale pines | erectile dysfunction has ruined my kQL life | 62a do rhino pills work | smK male reproductive enhancement pills | my GaW girlfriend has a penis | hypoxia genuine erectile dysfunction | viagra soft tabs RN7 100mg review | QWY viagra and redbull together | Np0 does covid lead to erectile dysfunction | mens Ekw virility power side effects | most effective capsulas para sexo | can i take dAL 200mg of viagra in one day | is viagra considered a ph6 controlled substance | bp tablet big sale names | gnc fort collins co ECi | arb vs myG beta blocker | buy a99 viagra online best price | 2M2 selenium dosage for erectile dysfunction | livalis male enhancement pills phone OIi | viagra similares cbd vape nombre | can q3s hemeeoids cause erectile dysfunction | strong back male enhancement pills uvI reviews | health risks viagra cbd vape | cardio ILF improves erectile dysfunction | dr oz latest news lVr on erectile dysfunction | desire girls online shop | shark tank ED pills Es8 review | anxiety rite aid slogan | does enduros lWW male enhancement work