– సోమేష్‌కుమార్‌కు వినతి
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలోని హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హోంగార్డుల సంఘం నేతలు ప్రభుత్వ ముఖ్యసలహాదారు సోమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం సచివాలయంలో సోమేశ్‌కుమార్‌ను కలిసి తమ సమస్యలపై చర్చించారు. హోంగార్డులను పర్మినెంట్ చేయాలనీ, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలనీ, ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సోమేశ్‌కుమార్ హోంగార్డుల సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలులు అశోక్‌కుమార్, డాక్టర్ కొత్వాల్ దయానంద్, రాష్ట్ర కమిటీ సభ్యులు హరిబాబు, మన్మధరావు, తిరుపతికుమార్ తదితరులు పాల్గొన్నారు.