సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-కొత్తగూడెం టౌన్‌
సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పదని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం(సిఐటియూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు అన్నారు. ఆదివారం కొత్తగూడెం రైటర్స్‌బస్తీలోని ట్రాన్సిట్‌ గెస్ట్‌ హౌస్‌లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికల స్థానిక సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని మండి పడ్డారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సింగరేణి అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, సింగరేణి కాంటాక్ట్‌ కార్మిక సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి జి.శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.