నవతెలంగాణ-కారేపల్లి
ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం, పనిభారం తగ్గింపు వంటి సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆశ వర్కర్స్, భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ఆశ వర్కర్ సీరియల్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల జంక కళ్యాణి, మధ్యాహ్న భోజన యూనియన్ కార్యదర్శి మేదరి మంగుతాయి డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ 14 రోజు సమ్మె మధ్యాహ్నం భోజన కార్మికుల 11వ సమ్మె సందర్భంగా శిబిరాలను ఉద్దేశించి వీరు ప్రసంగించారు. సమస్యలు పరిష్కరిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మైకుల ముందు మాట్లాడుతూ తిరగటం కాదని, సమ్మె చేస్తున్న సంఘాలను పిలిచి ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె శిబిరాలలో యూనియన్ల నాయకులు కుమారి సుజాత, సరస్వతి, తార కృష్ణమ్మ, దేవి విక్టోరియా, నరసమ్మ, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.