రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం కాయం

నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని కామారెడ్డి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన 34 మంది ఇతర పార్టీలకు చెందినవారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రైతులకు రుణ మాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.