రెండవ రన్నర్‌గా నిలిచిన లాస్య ప్రియ

– అభినందించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇండియన్‌ ఐడల్‌ సంగీత పోటీల్లో ద్వితీయ రన్నరప్‌గా సిద్దిపేటకు చెందిన లాస్యప్రియ నిలవడాన్ని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ప్రసంసించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదిక ద్వారా లాస్యప్రియను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సిద్దిపేటకు చెందిన గుమ్మన గారి లాస్యప్రియ ఆహ యాప్‌లో జరిగిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2 లో రెండవ రన్నర్‌గా నిలిచి తన సత్తా చాటారు. మొదటి నుండి పట్టుదలతో తన సంగీత ప్రదర్శనతో ఆమె ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ ప్రోగ్రాం జరుగుతున్న క్రమంలో మంత్రి హరీష్‌ రావు లాస్య ప్రియకు ఆశీస్సులు అందిచారు.