– రంగులు మార్చి రాజకీయాలు అవసరమా?
– జనం కోసం నికరంగా నిలిచే వారిని గెలిపించాలి
– సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని
నవతెలంగాణ-నేలకొండపల్లి
ఈనెల 30వ తేదీన పాలేరులో జరుగుతున్న ఎన్నికల్లో డబ్బులకు, కాంట్రాక్టులకు అమ్ముడు పోయే నాయకులను, రాజకీయాలను చిత్తుగా ఓడించాలని సిపిఐ(ఎం) పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం మండలంలోని కోరట్లగూడెం, కోనాయిగూడెం, ఆరెగూడెం, ఆచర్లగూడెం, గువ్వలగూడెం, ముజ్జుగూడెం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలు, కోలాట నత్యాలతో తమ్మినేనికి ఎదురేగి మహిళలు మంగళహారతులు, పూలమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధన బలానికి జన బలానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఒకవైపు అధికార దాహంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వైపు రంగులు మార్చే కార్పొరేట్ నాయకులు పోటీలో ఉండగా, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తమ్మినేని సుబ్బయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చిన్ననాటి నుండే ఎర్రజెండాపై విశ్వాసంతో గత 50 ఏళ్లుగా కష్టజీవుల కోసం నిజాయితీగా అహర్నిశలు కృషి చేస్తున్న తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలతో పరిచయం లేని కొంతమంది కార్పోరేట్ శక్తులు కాంట్రాక్టు పనులు పెంచుకోవడం కోసం సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాలలో చేరి స్వచ్ఛమైన రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ యోజనాల కోసం అధికార దాహంతో పూటకో పార్టీ మారుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ వ్యక్తులు చట్టసభలకు వెళ్తే ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై చర్చ పెట్టని వారు, అవకాశవాదం డబ్బు మదం అహంకారంతో రంగులు మార్చే రాజకీయాలు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. వారు గతంలో ఏ పార్టీలో ఉన్నారో, నేడు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో, రేపు మరే పార్టీలోకి చేరతారో ప్రజలు గమనించాలన్నారు. ప్రచారంలో జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, రాసాల కనకయ్య, కట్టెకోల వెంకన్న, బెల్లం లక్ష్మి, దుగ్గి వెంకటేశ్వర్లు, సిరికొండ ఉమామహేశ్వరి మారుతి కొండలరావు, మందడపు మురళీకృష్ణ, ఎడ్ల తిరుపతిరావు, శీలం అప్పారావు, డేగల వెంకటేశ్వరరావు సిరికొండ నాగేశ్వరరావు గురజాల వెంకటేశ్వర్లు మారుతి సూర్యనారాయణ దండా సూర్యనారాయణ నున్న మధుసూదన్ మేగడ లింగరాజు అమరబోయిన బిక్షం బోయినపల్లి కొండలరావు సిరికొండ వెంకట్రావమ్మ గాదే వెంకటేశ్వర్లు గురజాల ఉపేందర్ రావ్ బొడ్డు మధు సామల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో పలువురు చేరిక
ఖమ్మంరూరల్: పేదలకు అండ ఎర్రజెండా అని సిపిఎం ఖమ్మంరూరల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు పి.మోహన్‌రావు అన్నారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఎం శ్రేణులు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అరేంపుల గ్రామంలో తమ్మినేని తనయుడు సంఘమిత్ర ఇంటింటి ప్రచారం చేశారు. మండలంలోని మంగళగూడెం గ్రామంలో సిపిఎం పట్ల పలువురు ఆకర్షితులై సిపిఎంలో చేరారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కొప్పుల రామయ్య, జోన్ కన్వీనర్ వడ్లమూడి నాగేశ్వరరావులు వారికి సిపిఎం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, యామిని ఉపేందర్, పి.సంగయ్య, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, తోట పెద్ద వెంకటరెడ్డి, పెంట్యాల నాగేశ్వరరావు,వల్లూరి సీతారామరెడ్డి,మద్ది వెంకట రెడ్డి,తాటి వెంకటేశ్వర్లు,భూక్య నాగేశ్వరరావు, పొన్నం వెంకటరమణ, సిలివేరు బాబు, అద్దంకి తిరుమలయ్య, కారుమంచి గురవయ్య, పొన్నం భాస్కర్, చాంద్ పాషా, తిరపయ్య, పోలూరి నాగయ్య, హనుమంతు, గంధం లక్ష్మీ, భరత్, నాగమణి, ఉప్పలయ్యా, నర్సమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.