– భారత ఆహార సంస్థతోనే సమస్యలు…:
– రైస్ మిల్లర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్ని విధాల సహకరిస్తున్నదనీ, అయితే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)తోనే సమస్యలొస్తున్నాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విమర్శించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు గంపా నాగేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో 110 లక్షల టన్నుల ధాన్యం రైస్ మిల్లుల్లో ఉందనీ, ఈ క్రమంలో రాబోయే పంటను ఎక్కడ నిల్వ చేసుకోవాలనే దానిపై ఇప్పటికే పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసినట్టు తెలిపారు. కొత్తగా వచ్చే పంటను స్థలాభావం వల్ల అన్‌లోడ్ చేసుకోవడానికి వారం రోజులు పడుతుందనీ, కేంద్ర ప్రభుత్వమే స్థలం చూపించాలని కోరారు. రబీ ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయనీ, అసత్యా ప్రచారాలు, అపోహలను నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో 3 వేల మిల్లర్లలో ఎక్కడో ఒక దగ్గర జరిగేదాన్ని మొత్తానికి ఆపాదించడం సరికాదని తెలిపారు. యాసంగిలో 50 శాతం ధాన్యం నూకలవుతుందని వివరించారు. నూకల నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,400 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా పండుతుందనీ, వర్షాలు ఎక్కువగా రావడంతో ధాన్యం తడిచిందనీ, ముందు అనుకున్న దాని కన్నా బియ్యం తక్కువగా వస్తున్నాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని ఇస్తే తమకు ఎక్కువ ధాన్యం ఇచ్చే అవసరం లేదని తెలిపారు. గతంలో టన్నుకు 67 కిలోలు వస్తే, తడిచిన తర్వాత 60 కిలోలు మాత్రమే వస్తుందని చెప్పారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల తో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితని కలిసి వినతి పత్రం అందజేశారు. వారి వినతి పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.