ఒంటెద్దు పోకడ పటేల్తనం దొరతనం రెండు కోట్ల నిధులు ఇష్ట రాజ్యం

– పటేల్తనం దొరతనంపై బగ్గు మన్న ఎంపిటిసిలు
– ఇలా కొనసాగితే వరగబేదాలతో పార్టీకి నష్టం
– ఎమ్మెల్యే ఎన్నికల్లో నష్టం వాటిల్లడానికే చేస్తున్న కుట్ర
– మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దిన్ దయాల్ ఆరోపణ
నవతెలంగాణ – మద్నూర్
ఉమ్మడి మద్నూర్ మండలంలోని నూతనంగా ఏర్పడ్డ డోంగ్లి మండలంలో ఒంటెద్దు పోకడ పటేల్తనం దొరతనం కొనసాగుతుందని ఎస్డిఎఫ్ రెండు కోట్ల నిధులు ఇష్టానుసారంగా ఎంపీటీసీలకు ఎంపీపీకి జడ్పిటిసికి తెలియకుండానే నిధులు కేటాయించడం జరుగుతుందని మద్నూర్ ఉమ్మడి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దిన్ దయాల్ పటేల్తనం దొరతనంపై మండిపడ్డారు ఆదివారం విలేకరుల సమావేశంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దిన్ దయాల్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు జయపాల్ రెడ్డి తదితరులు కలిసి మాట్లాడారు. డోంగ్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీలో ఒంటెద్దు పోకడ కొనసాగిస్తూ పటేల్తనం దొరతనం నడిపిస్తూ మంజూరైన ఎస్డిఎఫ్ రెండు కోట్ల నిధులను ఇటు ఎంపీటీసీలకు ఎంపీపీకి అటు జడ్పిటిసి సభ్యురాలుకు ఏ ఒక్కరికి ఎంతో కొంత కేటాయించకుండా పటేల్ దొరలే ఈ నిధులు ఇష్టానుసారంగా కేటాయించడం పార్టీకి నష్టం కలిగించడమేననివారు మండిపడ్డారు. ఇలాంటి వ్యవహారంతో పార్టీ నష్టపోతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు గెలిపించాలా లేక ఓడించాల పటేల్ తనం దొరతనం పనితీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ నీ నష్టం కలిగించే విధంగా ఉందని ఒంటెద్దు పోకట కొనసాగించిన ఎమ్మెల్యే అనుమంతు సిందే గెలుపు కోసం షయాశక్తుల కృషి చేస్తామని ఇలాంటి పటేల్తనం దొరతనం పట్ల ఎమ్మెల్యే అనుమంతు సిందే ప్రత్యేక దృష్టి సాధించి పార్టీలో ఎలాంటి భేదాలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన డోంగ్లి మండల అభివృద్ధి నిధులపై కొనసాగుతున్న ఒంటెద్దు పోకడను అరికట్టి ఎంపీటీసీలకు ఎంపీపీకి జడ్పిటిసి కి పార్టీ నాయకులకు సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా పార్టీ ఐకమందు దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు పార్టీలో వర్గ విభేదాలు కొనసాగడం ఒంటెద్దు పోకట పటేల్తనం దొరతనం కొనసాగించడం పార్టీకి నష్టమే జరుగుతుందని ఎమ్మెల్యే ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.