చంద్రయాన్‌-3 విజయం యావద్భారతీయులది

– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చంద్రుడి దక్షిణ ధృవం మీదకు ఇస్రో పంపించిన ‘విక్రమ్‌’ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్‌ అయిన తొలి దేశంగా నిలిచిన ఘనత మనకు దక్కుతుందన్నారు. చంద్రయాన్‌-3 ల్యాండ్‌ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ నాయకులతో కలిసి ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఆయన వీక్షించారు. అది విజ యవంతం కాగానే నినాదాలు చేస్తూ సంబురాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇస్రో, చంద్రయాన్‌ టీమ్‌ను హృదయపూర్వకంగా అభినంది ంచారు. ఇస్రో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయో గాలను మరింత ముందుకు తీసుకెళ్లారని కొనియాడా రు. చంద్రునిపై భవిష్యత్‌లో చేయబోయే ప్రయోగాల కు మన ఇస్రో దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌లోకి కొత్తగా 137 మంది
బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌లోకి కొత్తగా 137 మందిని నియమిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు లు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.