విద్య బోధన విధానం జీవితకాలం గుర్తుండాలి

– రామ్ కిషోర్ సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపల్.
నవతెలంగాణ-గోవిందరావుపేట
పాఠశాల ఉపాధ్యాయుల విద్యా బోధన విధానం పిల్లలకు జీవితకాలం గుర్తుండాలని అప్పుడే మన బోధనకు సార్ధకత చేకూరుతుందని అని సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపల్ రామ్ కిషోర్ అన్నారు. నవతెలంగాణ ఎడ్యుకేషన్ స్పెషల్ సందర్భంగా రామ్ కిషోర్ మాట్లాడారు. పాఠశాలలో నవోదయ సైనిక్ ఎంట్రెన్స్ కోచింగ్ ని స్థాపించిన ప్రథమ సంవత్సరంలో నవోదయ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందన్నారు రెండవ సంవత్సరంలోనే అద్భుతమైన అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగిందన్నారు. కోచింగ్ తీసుకున్న 12 మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో నవోదయ కు ఎంపిక కావడం జరిగిందని ఉపాధ్యాయుల అందరి సమిష్టి కృషితో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పిల్లల ఏకాగ్రతతో తాము ఈ విజయాన్ని సాధించినట్లు గర్వంగా చెబుతున్నానని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో నవోదయకు మరో బ్యాచ్ ని సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్లకు పాఠశాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులను పంపడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్నామని అన్నారు. గణితం మరియు షార్ట్ కట్స్, టెక్నిక్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నామని అన్నారు. డైలీ, వీక్లీ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు అపార అనుభవం గల అధ్యాపకులతోని విద్యాబోధన కొనసాగిస్తున్నామని విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడానికి గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నామన్నారు. ప్రత్యేక స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ వ్యాకరణం తో పాటు పాఠ్యాంశ విశ్లేషణ తక్కువ ఫీజుతో అత్యుత్తమ శిక్షణ రెసిడెన్షియల్ విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నామన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక తరగతుల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నవోదయ ఎంట్రన్స్ ఫలితాల్లో పాఠశాల నుండి 12 మంది విద్యార్థులు ఎంపిక కావడంతో పాఠశాల పరిస్థితులు ఉపాధ్యాయుల బోధన విధానం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల ఆరోగ్య అభివృద్ధి అన్ని రకాలుగా ప్రభావం చూపుతోందని ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు.