నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దులో గల సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం చేపట్టారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఆలయ పాలకవర్గం సమక్షంలో హుండీ లెక్కించగా రెండు లక్షల 69 వేల 952 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాశీనాథ్ పటేల్ పాలకవర్గం సభ్యులు జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.