జిల్లా కేంద్రానికి చేరుకోనున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక బస్సు యాత్ర

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటాలను ఈనెల 18న ప్రారంభమైన ప్రజాసంఘాల ఐక్యవేదిక బస్సు యాత్ర నేడు అనగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం కు చేరుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ఇండ్లు ఇళ్లస్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా భూ పోరాటాలను చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు వెళ్తున్న బస్సు యాత్ర ఈనెల 24వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు జిల్లా కేంద్రంలో పలుచోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. అందుకు అనుగుణంగా నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక బస్సుయాత్రను సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.