
నవతెలంగాణ-ధర్మసాగర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతు బంధువు,రైతు పక్షపాతి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాల సందర్బంగా రాయగూడెం గ్రామంలో ఎద్దుల బండ్ల ర్యాలీను ప్రారంభించి రైతు దినోత్సవంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, కలెక్టర్, పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బాంధవుడు కెసిఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పేలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని అన్నారు. రైతు భీమా పథకం ద్వారా పేద రైతులు చనిపోతే రూ. 5 లక్షలు వస్తున్నాయని అన్నారు. గత 70 సంవత్సరాల కాలంలో ఎవరు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 9 సంవత్సరాల కాలంలో చేశారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాకముందు ఘణపురం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదివేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
మాట్లాడుతూ జిల్లాలోని 55 రైతు వేదికల్లో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రైతు వేదికల్లో పంటలపై వచ్చే అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఏఈఓ లను, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని తెలిపారు. జూన్ 2 నుండి 22 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్బుతమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. గతంలో రైతులకు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆ సమయంలో పోలీసులను కాపాలాపెట్టి ఎరువులు పంపిణీ చేసేవారని అన్నారు. గతంలో 62 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తే ఇప్పుడు 1.32లక్షల ఎకరాలు సాగవుతుందని అన్నారు. ధాన్యం ఉత్పాదకతలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ లు చాడ సరిత, పిట్టల శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, డీఏఓ దామోదర్ రెడ్డి, మండల రైతు బంధు కోఆర్డినేటర్ సోంపెల్లి కరుణాకర్, కేయూ వీ.సీ ప్రోఫెసర్ తాటికొండ రమేష్, తహశీల్దార్ రజిని, ఏఓ పద్మ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.