అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ-చండ్రుగొండ
మతసామరస్యానికి అర్థం పట్టేలా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలానికి చెందిన ముస్లిం మత పెద్దలు, అలాగే యువకులు, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు, చండ్రుగొండ టౌన్‌ ప్రెసిడెంట్‌ సూరా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్న గూడెంలో శాసనసభ్యులు నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం మండలంలో ముస్లింలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు సమస్యలు తస్కారమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మజీద్‌ కమిటీ అధ్యక్షులు మహ్మద్‌ షమీ హుస్సేన్‌, మజీద్‌ కమిటీ సభ్యులు మహ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌ (బోలె), జలీల్‌, సారీజ్‌, ఇస్మాయిల్‌, రహిమాన్‌, సజ్జాద్‌, యాకూబ్‌ పాషా, పాషా, నహిముద్దిన్‌, సమీర్‌, తదితరులు పాల్గొన్నారు.