తనకుర్ధి గ్రామంలో కోతుల బేడద..

నవతెలంగాణ- మోపాల్

మోపాల్ మండలంలోని తనకుర్ధి  గ్రామంలో కోతులు చిన్నపిల్లలపై వృద్ధులపై విపరీతంగా దాడి చేస్తున్నాయి, మంగళవారం రోజు ఒక ప్రైవేట్ పాఠశాల నుంచి మధ్యాహ్నం సమయంలో బస్సు దిగిన వెంటనే దాదాపు నలుగురు పిల్లలపై దాడి చేశాయి, అదృష్టవశాత్తు పిల్లలు పరిగెత్తడంతో అక్కడున్న కొందరు యువకులు వాటిని వెంబడించడం ఎవరికి ప్రాణాపాయం జరగలేదు, ఒకవేళ అవి మూకుమ్మడిగా దాడి చేసి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది ఈ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి ఈ కోతుల బెడద ఉన్న గ్రామ ప్రథమ పౌరుడు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ వారు ఏం చేయకపోయినా కనీసం ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకపోవడం లేదు రేపు ఈ పిల్లల పైన దాడి చేస్తే వారి పరిస్థితిని ఎలా ఉంటుందో ఊహాజణితం, ఉన్నతాధికారులైన స్పందించి వీటి బెడద నుంచి గ్రామస్తులను కాపాడాలని వారు కోరుకుంటున్నాను