బడుల పనివేళల్లో మార్పులేదు

– చంద్రయాన్‌-3ని యూట్యూబ్‌ ద్వారా వీక్షించాలి
– విద్యాశాఖ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 బుధవారం చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ అపూర్వఘట్టాన్ని ఇండ్లలోనే విద్యార్థులు వీక్షించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. అయితే చంద్రయాన్‌-3ని వీక్షించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ, సాయంత్రం 6.30 గంటల వరకు విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతూ డీఈవోలు, ప్రిన్సిపాళ్లకు విద్యాశాఖ తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది. చంద్రయాన్‌ -3 కోసం పాఠశాలల పనివేళల్లో మార్పులేదని స్పష్టం చేసింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ దిగే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను గురువారం అన్ని పాఠశాలల్లో యూట్యూబ్‌ ద్వారా విద్యార్థులకు ప్రదర్శించాలనీ, తరగతి గదుల్లో దీనిపై వారితో చర్చ నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రొజెక్టర్‌, కెయాన్‌, టీవీల ద్వారా చూపించాలని కోరింది. మిగతా పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటివద్ద టీవీలు, మొబైల్‌లోగానీ చూడాలని సూచించింది.