ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు : వెంకట్రాముడు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నూతన సచివాలయం పక్కన మీడియా సెంటర్‌లో దొంగతనం జరిగిందన్న కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని డాక్టర్‌ బీఆర్‌ అంబెడ్కర్‌ తెలంగాణ సచివాలయ చీప్‌ సెక్యూరిటీ అధికారి వెంక ట్రాముడు స్పష్టం చేశారు.. ఇప్పటికే మీడియా సెంటర్‌ లో పనులు పూర్తి అయ్యి, పూర్తి స్థాయిలో జర్నలిస్టులు వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక నూతన సచివాలయ ప్రాంగణంలోను, దాని చుట్టుప్రక్కల తగినంత పోలీసు సిబ్బంది ద్వారా పటిష్టమైన నిఘా, భద్రతా నిరంతరం కొనసాగేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గట్టి నిఘా నేపథ్యంలో సచివాలయ పరిసరాలలో ఎలాంటి దొంగతనం జరిగేందుకు ఆస్కారం లేదని వెంకట్రాముడు పేర్కన్నారు.