నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఈనెల 9న సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని వీరభద్రం నామినేషన్‌కు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని మండల కార్యదర్శి కొమ్ము శీను పిలుపునిచ్చారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు గ్రామంలో జోన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బింగి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ్మినేని వీరభద్రం చిన్నతనం నుంచి ఇప్పటివరకు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర తమ్మినేని కుందని, దుమ్ముగూడెం ప్రాజెక్టు కావాలని మహాప్రస్థానం పాదయాత్ర చేసి దళిత వాడల అభివృద్ధి కోసం కెవిపిఎస్ సైకిల్ యాత్ర ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి ప్రజల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వీరభద్రం నామినేషన్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామములో డోర్ టు డోర్ ప్రచార నిర్మించి నామినేషన్‌కు తరలిరావాలని, సుత్తి కుల నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో బింగి రమేష్, గుండుమల ఉపేందర్, నాగటి సురేష్, పల్లి రమేష్, మోటపోతుల శ్రీను, అంగిరేకుల శ్రీహరి, సనాతన చారి, సత్యనారాయణ చారి, వెంకన్న, అన్న బత్తుల సత్తిబా, అరవయ్య తదితరులు పాల్గొన్నారు.