– బీఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి
ఆడబిడ్డ వివాహానికి రూ.20వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ-యాచారం
గ్రామంలో పేద కుటుంబాలకు అండగా నిలబడతానని బీఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన పంది లక్ష్మమ్మ మనవరాలి వివాహానికి ట్రస్టు తర పున రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల పెండ్లీ లకు తనవంతు సహాయం చేస్తానని తెలిపారు. ట్రస్టు తరపున ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. తాను సంపాదించిన దాంట్లో ఎంతోకొంత ఇతరులకు సహాయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు కాళ్ల జంగయ్య, కొంగరి భిక్షపతి, కారోబార్ నూకం మహేందర్, పెరుమాండ్ల రమేష్, పంది వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.