— Telugu Scribe (@TeluguScribe) September 14, 2023
నవతెలంగాణ – నల్లొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు. అక్కడి నుండి తన మిత్రులతో కలిసి ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు. వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.