ఇవే నాకు చివరి ఎన్నికలు..

– కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఐదోసారి పోటీ
– ఇవే నాకు చివరి ఎన్నికలు.. గెలిపించండి
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా
నవతెలంగాణ-పాల్వంచ
ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రధాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాదంతో ఐదోసారి పోటీ చేస్తున్నానని నా తుది శ్వాస వరకూ ప్రజాసేవ చేస్తానని బీఆర్‌ఎస్‌ కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా తొలుత ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఆశీర్వాదంతో కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధిలో దూసుకుపోయిందని, పాల్వంచ, కొత్తగూడం అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. జిల్లా కలెక్టరేట్‌ మెడికల్‌ కాలేజ్‌ జీవో నెంబర్‌ 73, 76 తీసుకొచ్చి 12 వేల మందికి ఇండ్ల స్థలాలు కిన్నెరసాని పైపులను 35 కోట్లు మంజూరు చేశారని అన్నారు. 817 సర్వే నెంబర్లు అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా కేసీఆర్‌ వల్లే అవుతుందని అన్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలని అభివృద్ధి చేశానని, గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని, ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.