నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. 54 నియోజకవర్గాల సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనున్నది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో ఈ నెల 25న జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు.