మణిపూర్‌ ఘోరానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

– ఏఐఎస్‌ డి డబ్ల్యు, ఏఐఎఫ్‌డివై డిమాండ్‌
నవతెలంగాణ- మియాపూర్‌
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరే గింపు నుంచి అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎఫ్‌డిడబ్ల్యూ, ఏఐఎఫ్‌ డివైలో డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌ సంఘటనను నిరసిస్తూ స్టాలిన్‌నగర్‌లో కొవ్వొత్తులతో నల్లజెండా లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐ ఎఫ్‌ డిడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు పి.భాగ్యమ్మ మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారం లో రాష్ట్రాల్లో దళిత గిరిజన మైనార్టీల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగు తున్నాయని ఆరోపిం చారు. రెండు నెలలుగా మణిపూర్‌లో గిరిజన ప్రజల పైన వివక్షరహితంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తుంటే కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న రాష్ట్ర ప్ర భుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించడం సరికాదన్నారు. ఏఐ ఎఫ్‌డివై గ్రేటర్‌ హైదరాబాద్‌ కన్వీనింగ్‌ కమిటీ సభ్యురాలు డి కీర్తి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో అనేక ప్రాంతాలలో ప్రశ్నించే వారిపై అనేక రకాల దాడు లను హింసను చేస్తూ వస్తుందన్నారు. మణి పూర్‌లో జాతుల సమస్య వెలుగులో క్రిస్టియ న్‌ హిందూయిజం అనే మతం పేరుతో మానవత్వం లేని విధంగా మనసులపై ప్రధానంగా మహి ళలపై ఇలాంటి దుర్చర్లకు ప్రవర్తించడం బీజేపీ ప్రభుత్వ విధానం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. స్టాలిన్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించి అనంతరం కొవ్వొత్తులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌డిడబ్ల్యూ రాష్ట్ర నాయ కురాలు గూడా లావణ్య, ఎం రాణి,గ్రేటర్‌ నాయ కురాలు ధారాలక్ష్మి ఏఐఎఫ్‌డివై గ్రేటర్‌ హైదరా బాద్‌ నాయకులు కే షరీష్‌, లావణ్య, శోభ, వనజ, అనురాధ, వాసవి,సుస్మిత, లతా,శామల, కవిత, ఆశ మ్మ, అండాలమ్మ, కళావతి, విజయ, భాగ్య, లావణ్య, సువర్ణ, రోజా, మంజు, లక్ష్మి, లతా తదితరులు పాల్గొన్నారు.