పార్లమెంటు పరిధిలో మూడు చొప్పున బీసీలకు టికెట్లు ఇవ్వాలి

– ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జనాభా ప్రాతిపదిక 56 శాతం లెక్క ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించాలని ఏఐసీసీ ఓబీసీ జాతీయ నేత ప్రొఫెసర్‌ కత్తి వెంకటస్వామి టీపీసీసీని విజ్ఞప్తి చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో కనీసం మూడు చొప్పున బీసీలకు ఇవ్వాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20-30 ఏండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్న నేతలను గుర్తించి వారికి టికెట్లు కేటాయించాలని కోరారు. ఆర్థిక అంశాలను సాకు చూపకుండా బీసీ నేతల సామర్ధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలను ఎదుర్కొ నేందుకు బీసీలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నాయకులకు పూర్తిగా పని చేస్తామనీ, బీసీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బీసీలకు సహకరించి గెలిపించాలని కోరారు. పార్టీ గెలుపే అంతిమ లక్ష్యంగా పని చేస్తామని విజ్ఞప్తి చేశారు.