చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. చుండ్రు అనేక విధాలుగా జుట్టును దెబ్బతీస్తుంది. చుండ్రు వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం…
క రెండు చెంచాల నిమ్మరసం తీసుకుని, దానికి ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసే ముందు మీ జుట్టును సరిగ్గా కడగాలి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. గంట తర్వాత మీ జుట్టును కడగాలి. ఈ పేస్ట్‌ను ఏడు రోజుల పాటు రోజూ అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోయి జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది.
క చుండ్రును తొలగించడానికి మీరు నిమ్మరసంలో పెరుగును కూడా జోడించవచ్చు. దీని కోసం నిమ్మరసం తీసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. శుభ్రం చేసిన జుట్టుకు దీన్ని అప్లై చేయండి. పెరుగులోని పుల్లని తనం జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టును సిల్కీగా మార్చుతుంది.