కొందరు సన్నగా ఉన్నా సరే వారికి పొట్ట ఉంటుంది. ఇంక బరువు ఎక్కువగా ఉన్నవారి పరిస్థితి చెప్పనవసరం లేదు. దానిని తగ్గించుకోవడం కోసం చేయకూడని అన్ని పనులు చేస్తారు. అయితే ఎక్కువ కష్టపడకుండా రోజూవారీ చర్యల్లో కొన్ని భాగం చేసుకుంటే ఈజీగా పొట్ట తగ్గించుకోవచ్చు అంటున్నారు.
హైడ్రేట్‌గా ఉండండి: ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ముందుగా ఒక గ్లాసు నీరు తాగండి. అనంతరం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే జీవక్రియకు చాలా మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందం కోసమైనా, ఆరోగ్యం కోసమైనా ఏదైనా ప్రారంభించే ముందు శరీరంలోని మలినాలు తొలగించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఏమి చేసినా ఫలితాలు దక్కుతాయి.
మంచి అల్పాహారం: ఉదయాన్నే ప్రోటీన్‌తో నిండిన ఆహారాన్ని తీసుకుంటే.. అది మీ శరీరంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. అది మీ జీవక్రియను పెంచుతుంది. కాబట్టి మీ రోజులో మొదటి తీసుకునే ఆహారం ప్రోటీన్‌లతో నిండి ఉండేలా చూసుకోండి. అందుకే గుడ్లు, చీజ్ వంటి వాటిని లేదా ప్రోటీన్ రిచ్ స్మూతీలు కూడా తీసుకోవచ్చు. ఇవి కడుపు నిండుగా ఉండి.. అనారోగ్యకరమైన ఆహారం, వాటికి సంబంధించిన కోరికలను నిరోధిస్తాయి.
ఫైబర్ తప్పని సరి: మీ అల్పాహారంలో ప్రోటీన్లతో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా చేర్చుకోండి. ఇది మీ పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది. మీ ఆహార కోరికలను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీనికోసం ఉదయాన్నే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు తినండి.
ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్ మీ ఆకలిని పెంచుతుంది. క్రమంగా ఆకలిని చంపుతుంది. ఈ రెండింటి వల్ల కూడా ఎక్కువ బరువు సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటు శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తూ మీ రోజును ప్రారంభించండి. ఉదయాన్నే జిమ్‌కి వెళ్లడానికి లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయడానికి నిర్ణీత సమయం కేటాయించుకోండి. కచ్చితంగా ఏదొక వ్యాయమం చేయండి. దానికి అనుగుణంగా మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. వ్యాయామం చేసేందుకు జిమ్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ఏదైనా రోజూ చేయడం వల్ల చక్కటి ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి.