నేడు సచివాలయంలో

Today at the Secretariat– ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సచివాలయం ప్రాంగణంలో శుక్రవారం మసీదు, చర్చి, ఆలయం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గురువారం పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సంజరు కుమార్‌, కోరుకంటి చందర్‌, క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కమిషన్‌ ఎండి కాంతి వేస్లి, మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మెన్‌ శంకర్‌ లూక్‌, తెలంగాణ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ సాగర్‌, పలువురు క్రిస్టియన్‌ మైనారిటీ నేతలున్నారు.