– వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరద నష్టాన్ని అంచనా వేయడానికి సోమవారం రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించనున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అధికారుల బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖల అధికారులు, స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉంటారని తెలిపారు. ఆ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (చీణవీA) సలహాదారులు కునాల్ సత్యార్థి నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనావేయడంతోపాటుగా.. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.