నేడు మంచిరేవులకు సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్‌ రేక్‌ పార్కులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శనివారం కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఒక రోజు, ఒక కోటి మొక్కలు రాష్ట వ్యాప్తంగా నాటే కార్యక్రమం జరగనున్నది. మొయినాబాద్‌ మండలంలో ఫారెస్ట్‌ రేక్‌ పార్కు 256 ఎకరాల విస్తీర్ణంలో ఉండి డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తూ, భవన నిర్మాణ వ్యర్థాలతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసి ఫారెస్ట్‌ రేక్‌ పార్కుగా మార్చారు. వివిధ రకాలకు చెందిన 50 వేల మొక్కలు నాటారు. నిర్మాణ శిధిలాలను తొలగించిన తర్వాత, ఆ ఖాళీ ప్రదేశాలలో ‘పొద’ జాతికి చెందిన 25 వేల మొక్కలు నాటినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.