కలిసి కట్టుగా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

– సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి
– కడ్తాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం.
– కసిరెడ్డికి మద్దతుగా కనివిని ఎరుగని రీతిలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-ఆమనగల్ :
  కలిసి కట్టుగా పనిచేసి కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. కడ్తాల్ మండల కేంద్రములో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. స్థానిక ఎస్ఎల్ఆర్ గార్డెన్ లో జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా పంపాలని చెప్పుకొచ్చారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ జెండా ఎగురడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అంతకు ముందు  కడ్తాల్ మండల కేంద్రము నుంచి ఫంక్షన్ హాల్ వరకు కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా వేల సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ పలువురిని ఆలోచింప చేసింది. ఈకార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు రవికాంత్ గౌడ్, కేతావత్ హీరాసింగ్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, సర్పంచ్లు శంకర్, పాండు నాయక్, రాము, హంస మోత్య నాయక్, భారతమ్మ విఠలయ్య, సీనియర్ నాయకులు జవాహర్ లాల్ నాయక్, మల్లేష్ గౌడ్, హన్మా నాయక్, ఎక్బాల్ పాషా, రాంచందర్ నాయక్  తదితరులు  పాల్గొన్నారు.