26 కేటగిరీల్లో టూరిజం అవార్డులు

– వచ్చేనెల 27న అందజేత
– ఈనెల 31లోపు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘టూరిజం-గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ థీమ్‌తో 26 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ట్రావెల్‌ ఇండిస్టీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌, టూర్‌ ఆపరేటర్లు, గుర్తింపు పొందిన హోటల్స్‌, రెస్టారెంట్లు, ఇండింపెండెంట్‌ హోటల్స్‌తోపాటు ఆయా రంగాలకు సంబంధించిన సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేది వరకు హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ కార్యాలయంతోపాటు హన్మకొండ, నల్లగొండ జిల్లాల్లోని కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.