హైదరాబాద్‌ కలెక్టరేట్‌ తరలింపు

– నాంపల్లి నుంచి లక్డీకపూల్‌కు మార్పు
– ఫౖౖెల్స్‌, పర్నీచర్‌ తరలింపు
– రేపటిలోగా తరలించాలని ఆదేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాంపల్లి-అబిడ్స్‌ రోడ్డులోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను లక్డీకపూల్‌లోని పాత రంగారెడ్డి కలెక్టరేట్‌ భవన సముదాయంలో కి తరలించే ప్రక్రియ మొదలైంది. ఆదివారం నుంచే మొదలైన ఈ ప్రక్రియ రేపటిలోగా పూర్తికానుందని కలెక్టరేట్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తరలింపు పనులను సంబ ంధిత అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల్లోగా అన్ని శాఖలు కొత్త కలెక్టరేట్‌ నుంచి తమ కార్యకలాపాలు కొన సాగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, డీఆర్వో విభాగం ఫైల్స్‌, ఫర్నిచర్‌ను తర లించారు. మంగళ, బుధవారాల్లో మిగతా శాఖల తరలింపు ప్రక్రి య పూర్తి చేయనున్నారు. దీంతో దాదాపు 33 ఏండ్ల క్రితం నిర్మిం చిన హైదరాబాద్‌ కలెక్టరేట్‌ పాలనా వ్యవహారాలకు తెరపడ నుంది. నాంపల్లిలో 1990లో హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు ఎకరం స్థలంలో వివిధ విభాగాల కార్యక లాపాలను నిర్వర్తించేందుకు నాలుగు అంతస్తుల్లో భవనాలను కట్టారు. ప్రస్తుతం ఉన్న భవనానికి ఎదురుగా మరో రెండు భవ నాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌లో మొత్తం 32 విభాగాలు పని చేస్తుండగా.. దాదాపు 250 మంది అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
16 ఏండ్ల క్రితం..
1990లో నిర్మించిన హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు నూతన భవనాన్ని నిర్మించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని కనబర్చాయి. సమీకృత కలెక్టరేట్ల పేరిట రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో శరవేగంగా పనులు చేపడుతూ అక్కడి అధికారులు, ఉద్యోగులకు ఆధునిక హంగులతో సౌకర్యాలు కల్పిస్తున్నా.. నగరం నడిబోడ్డున పని చేస్తున్న యంత్రాంగాన్ని మాత్రం పట్టించుకోని పరిస్థితి. హైదరా బాద్‌ జిల్లా గ్రేటర్‌ పరిధిలో ఉండటంతో ప్రొటోకాల్‌ డ్యూటీలు మినహా సాధారణ పరిపాలన వ్యవహారాలు ఇక్కడ తక్కువగా ఉంటాయనే భావనతో కొత్త బిల్డింగు ప్రతిపాదనలను పట్టించు కునే వారు కరువయ్యారు. కొత్త భవనం నిర్మాణం పక్కనపెడితే.. కనీసం సౌకర్యాలున్న ఇతర ప్రాంతానికి తరలించడంపై కూడా ప్రభుత్వం అలసత్వం వహించడంతో ఉద్యోగులు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా మాసబ్‌ ట్యాంక్‌ మహావీర్‌ ఆస్పత్రి సమీపంలో ఎకరం ప్రభుత్వ స్థలంలో 16 ఏండ్ల క్రితం హైదరాబాద్‌ నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి ప్రతిపాదించా రు. 30 ఏండ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకో వడంతోపాటు కొన్ని గదుల్లోని స్లాబులు పెచ్చులూడి పడటం, తాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్లు అధ్వానంగా మార డంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలు దూరంగా ఉండడంతోపాటు కలెక్టరేట్‌లో 32 విభాగాలను నిర్వహించేం దుకు అనుకూలత లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో నూతన భవనాన్ని నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. ఒకే ప్రాంగణంలో అన్ని ఆఫీస్‌లో పాటు ప్రజలకు సులభతరమైన సేవలందించేందుకు కొత్త నిర్మాణానికి అప్పట్లో అడుగులు పడ్డాయి. అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు అంగీకరించి కొత్త కాంపెక్స్‌ కోసం ఏప్రిల్‌ 2007లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 10 అంతస్తుల్లో కాంప్లెక్స్‌కు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రయివేట్‌ కన్సల్టెంట్‌తో కలిసి డిజైన్‌ చేసింది. కాంప్లెక్స్‌ అంచనా వ్యయం రూ.46 కోట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దీంతో నిధుల కొరతతో పనులు ముందుకు జరగలేదు. 2008లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌ మిట్టల్‌ కలెక్టరేట్‌ కొత్త భవనంపై దృష్టి సారించారు. ఈ మేరకు మరో ఆర్కిటెక్ట్‌ ద్వారా గతంలో ప్రతిపాదించిన 10 అంతస్తులను 6 అంతస్తులకు తగ్గించారు. ఇందులో భాగంగా రూ.22 కోట్ల అంచనాతో 1.80.000 చదర పు అడుగుల విస్తీర్ణంతో సవరించి డిజైన్‌ చేశారు. కాగా, సవ రించిన ప్రణాళికలు, అంచనాలను తిరిగి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. పాత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భూమిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ప్రతిపాదిత కొత్త కాంప్లెక్స్‌ కోసం ఉపయో గించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో నిర్మాణం పెండింగ్‌లో పడింది. నగర శివారులోని కొంగరకలాన్‌లో ఇటీవల నిర్మించిన నూతన సమీకృత భవన సముదాయంలోకి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను తరలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ బదిలీకి మార్గం సుగమైంది. పాత రంగారెడ్డి కలెక్టరేట్‌లో కొన్ని మరమ్మతు పనులు పూర్తి చేయాల్సి ఉందనీ, ఇందుకు రూ.3 కోట్లు కావాలని ఆర్థికశాఖకు కొన్నినెలల క్రితం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మరమ్మతు పనులు తర్వాత చేసుకోవచ్చనీ, ముందు ఇక్కడి నుంచి షిఫ్ట్‌ కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో షిఫ్టింగ్‌ చేస్తున్నారు. నాంపల్లి కలెక్టరేట్‌లో త్వరలోనే పోలీసు సౌత్‌ వెస్ట్‌జోన్‌ ఆఫీసు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.